బొల్లేదుపాలెం లో గ్రామ సచివాలయం వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవం
iraila 13, 2021
TV77తెలుగు కోరుకొండ:
సోమవారం కోరుకొండ మండలం బొల్లేదుపాలెం గ్రామం నందు 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయంను మరియు17.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా గ్రామ ప్రజలకు ఏ అవసరం ఉన్న అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగకుండా సచివాలయానికి సంప్రదిస్తే నిర్ణీత సమయంలోగా వాళ్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.ఇది జగనన్న ప్రభుత్వం అని ప్రతి 2 వేల కుటుంబాలకు ఓ
సచివాలయమును ఏర్పాటు చేసి అందులో 13 మంది వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల ద్వారా సుమారు 550 సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలోను వైయస్సార్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా గ్రామస్తులు అవసరమైన వైద్య సదుపాయాలను ఆ క్లినిక్ నందు పొందవచ్చునన్నారు.గ్రామ సచివాలయం ద్వారా అర్హత ఉన్నా ప్రతి ఒక్కరికి కుల,,మత,రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హతలు మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను తలుపు తట్టి అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.రానున్న రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడీ బిల్డింగ్ లు, బరియల్ గ్రౌండ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.ఖచ్చితంగా ఎన్నికల వచ్చే సమయానికి ఏదయితే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలు అన్నిటినీ పూర్తిచేసి నియోజకవర్గాల్లో పూర్తి త్రాగునీటి సమస్య పరిష్కారానికి సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేస్తామన్నారు.సంక్షేమ పథకాల రారాజుగా వెలుగొందిన జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము కూడా పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలియజేశారు. అనంతరం బొల్లేదుపాలెం గ్రామ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జన-బాట కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పరిష్కరించారు.