ముంపు బారినుంచి రాజమండ్రిని కాపాడాలి ప్రజా పక్షం రాష్ట్ర నాయకుడు దేశ రెడ్డి బలరాం నాయుడు మౌన నిరాహార దీక్ష

TV77తెలుగు రాజమహేంద్రవరం: దశాబ్దాల పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ముంపు బారినుంచి రాజముండ్రి నగరాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రజా పక్షం రాష్ట్ర నాయకుడు దేశి రెడ్డి బలరామ నాయుడు మౌన నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక రోజు మౌన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,నాలుగు దశాబ్దాలుగా రాజమండ్రి నగరంలో తుమ్మలావ, ఆర్యాపురం ప్రాంతాలు మాత్రమే ముంపుకు గురయ్యే అన్నారు. చాలా మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు, మారుతున్న కోట్లాది రూపాయల నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ ముంపు సమస్యను పరిష్కరించ లేకపోయారన్నారు. . నేడు నగరంలో రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్, శ్యామల సెంటర్, హైటెక్ బస్టాండ్, వి .యల్. పురం, తాడితోట పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు , కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ముంపు సమస్య పెరిగిందన్నారు. తన ఉద్యమం ఒక రోజే కాదని, దశలవారీగా ఆమరణ నిరాహార దీక్ష వరకు ఉద్రిక్తతం చేస్తామని అన్నారు.