మహిళల భద్రత పై పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
iraila 08, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
బుధవారం రాజమహేంద్రవరం అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, కళశాల విద్యార్ధినులు, యువతులకు దిశ చట్టం మరియు "దిశ యాప్" పై అవగాహన సదస్సు
నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్ధినులు
అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి, ఎంపీ మార్గాని భరత్ రామ్ అధ్యక్షత
వహించినారు, అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఐ.పి.యస్., ముఖ్య అతిధిగా పల్గొన్నారు. పద్మావతి, చైర్మన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. మెడపాటి షర్మిళా రెడ్డి, రుడా
చైర్మన్. టి.కె.విశ్వేశ్వర రెడ్డి, ఎండి. రైట్ గ్రూప్ అఫ్కా లేజెస్. కె.లతా మాధురి,అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్). యం.శ్రీలత, డిఎస్పి సౌత్ జోన్ ఇతర అతిధులు పల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి,ఐ.పి.యస్.,
మాట్లాడుతూ.మహిళల సురక్షణ, రక్షణ, మహిళా భద్రత కొరకు తమ ఫోన్లలో దిశ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.రాజమహేంద్రవరం పోలీసులు నగర ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడం కోసం తీసుకుంటున్న వివిధ చర్యలను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మహిళల భద్రతపై దృష్టి పెడుతూ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన "దిశ యాప్" పట్ల మహిళలు, విద్యార్ధినులు, యువతులకు ఎస్పీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశ బిల్లు ను ప్రవేశ పెట్టడంతో పాటు, మహిళల భద్రతకు అనుబంధంగా దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ దిశ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు శాఖ మహిళల భద్రత, రక్షణ కల్పించడంలో పెను మార్పులు తెచ్చినారు, భవిష్యత్తులో కూడా మహిళల భద్రత పట్ల మరిన్ని సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందని తెలియచేసారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళలు, విద్యార్థినులు, యువతులు ఈ దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోని సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ దిశ యాప్ ఆపద సమయంలో ఒక జీవితాన్ని కాపాడుతుందని, అత్యవసర సమయంలో వినియోగం కోసం
యాప్ ను డిలీట్ చేయకుండా వారి ఫోన్లలో ఎల్లప్పుడు ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేసారు. నగరంలో , నగర శివార్లలో ఉన్న ఆభద్రత, సమస్యాత్మక, ఐసోలేటెడ్
ప్రదేశాల్లో మహిళా భద్రతను మెరుగుపరచడానికి రాజమహేంద్రవరం పోలీసులు అంకితభావంతో
చేస్తున్న కృషి గురించి ఎస్పీ వివరించారు. నేరాల నియంత్రణలో భాగంగా గత 45 రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వివిధ పోలీస్ స్టేషన్ లలో 2500 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆభద్రత,సమస్యాత్మక, ఐసోలేటెడ్ప్ర దేశాల్లో ఆసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారించేందుకు నిరంతర నిఘా, కొనసాగిస్తూ రెగ్యులర్ బీట్స్, రక్షక్ వాహనాలతో పాటు డ్రోన్ పెట్రోల్స్ క్రమం తప్పకుండా పర్యవేక్షించుచున్నారు. అదేవిధంగా రాత్రి సమయములో ప్రజల భద్రతను మెరుగుపరచడానికి,"ఫిన్స్" వేలిముద్ర పరికరం ద్వారా నగరమంతటా అనుమానాస్పదంగా
సంచరిస్తున్న వ్యక్తుల వేలిముద్రలను పోలీస్ అధికారులు తనిఖీ చేసి ఇదివరుకు క్రిమినల్ కేసులు
ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియచేసారు.