భారీ బంగారం చోరీ కేసును చేదించిన పోలీసులు

TV77తెలుగు బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరల విద్యా సాగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గుంటూరు బ్యాంక్ ఆఫ్ బరోడా బాపట్ల బ్రాంచ్ లో మొత్తం 48 గోల్డ్ బ్యాగ్స్ ల లోని 5.8 కేజీల బంగారం 17 ప్యాకెట్ అసలు బంగారానికి బదులు ఫేక్ గోల్డ్ వున్నట్లు , అందుకు అదే బ్యాంక్ లో సబ్ స్టాఫ్ సుమంత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదు మేరకు బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు ఆద్వర్యంలో బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ పి. కృష్ణయ్య , బాపట్ల రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి మరియు బాపట్ల పట్టణ ఎస్సై రఫీ ,బాపట్ల రూరల్ ఎస్సై ప్రసాద్ వివిధ బృందాలుగా ఏర్పడి, బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ పి. కృష్ణయ్య దర్యాప్తు చేయగా పేర్లి సుమంత్ అను అతను 2017 లో బ్యాంక్ ఆఫ్ బరోడా బాపట్ల బ్రాంచ్ లో సబ్ స్టాఫ్ గా చేరి విధులు నిర్వహించుచూ, దురలవాట్లు కలిగి, షేర్ మార్కెట్ మరియు ఆన్లైన్ లో రమ్మీ గేములు ఆడే అలవాటు వున్నట్లు మరియు బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతా దారుల యొక్క గోల్డ్ ని ఎవరికి తెలియకుండా బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లోని మొత్తం 48 గోల్డ్ బ్యాగ్స్ ల లోని 5.8 కేజీల బంగారం తీసి కొంత అతని చిన్న నాటి స్నేహితు లైన బాపట్ల పట్టణం జమేదార్ పేటకు చెందిన ఉన్నం అశోక్ కుమార్ అతని తమ్ముడు కిశోర్ కుమార్ లకు ఇచ్చినట్లు సుమంత్ పేరు మీద బాపట్ల పట్టణం లోని సూర్యలంక రోడ్ లోగల మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో సుమారు 1350.07 గ్రాములు, అలాగే ఉన్నం అశోక్ కుమార్ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో సుమారు 1146.65 గ్రాములు , ఉన్నం కిశోర్ కుమార్ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో సుమారు 1541.83 గ్రాములు మరియు ఉన్నం అశోక్ కుమార్, కిశోర్ కుమార్ ల తల్లి గారి పేరు మీద మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో సుమారు 799.09 గ్రాములు మొత్తం మణప్పురం సైనాన్స్ లిమిటెడ్ లో కుమార్, కిశోర్ కుమార్ లు బాపట్ల పట్టణం లోని మార్కెట్ ఎదురు గల ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ లో 4837.64 గ్రాములు బంగారు అబరణాలు పెట్టాలోన్ 1 కోటి 87 లక్షలు తీసుకున్నట్లు, అలాగే ఉన్నం అశోక్ బంగారు అబరణాలు సుమారు 1141.40 గ్రాముల బంగారు అబరణాలు పెట్టి లోన్ 34,00,000 లక్షలు తీసుకున్నట్లు, గుర్తించట మైనది. అలాగే సుమంత్ ని అరెస్టు చేసినప్పుడు అతని బ్యాగ్ లోని 129 గ్రాములు బంగారు అబరణాలు రికవరీ చేయట మైనది. ఈ కాసులోని మొత్తం 6108.4 గ్రాముల బంగారు అబరణాలు వాటి విలువ సుమారు రూ. 2,36, 69, 299 రికవరీ చేసి ఆదివారం పేర్లి సుమంత్ అలాగే ఉన్నం అశోక్ కుమార్, ఉన్నం కిశోర్ కుమార్ లను అరెస్టు చే చేయట మైనది వీరిని కోర్టుకు హాజరుపరుస్తామని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో సహకరించిన సీఐలు ఎస్సైలు అందరికి జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులు ఇప్పిస్తామని అన్నారు. డిఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసును త్వరగా ఛేదించినందుకు సీఐ , ఎస్సైలను, అభినందించారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ కృష్ణయ్య ,రురల్ సిఐ శ్రీనివాసరెడ్డి ,టౌన్ ఎస్సై రఫీ,రురల్ ఎస్సై వెంకట ప్రసాద్ లు పాల్గొన్నారు.