సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు పిలుపు
iraila 19, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. భవాని ఛారిటబుల్ ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి టిఎన్టియూసీ జిల్లా అధ్యక్షులు తనయుడు నక్కా సంతోష్ దివ్యాంగుల సౌకర్యార్ధం 10 వీల్ చైర్లు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఆదిరెడ్డి వాసులకు స్థానిక తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో అందచేశారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ భవానీ ఛారిటబుల్ ట్రస్టు చేస్తున్న సేవలను గుర్తించి నక్కా సంతోష్ తన బాధ్యతగా వీల్ చైర్లు అందించడాన్ని అభినందించారు. దివ్యాంగులకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నక్కా దేవీవరప్రసాద్, నక్కా సంతోష్, కంటిపూడి రాజేంద్రప్రసాద్, భాషా తదితరులు పాల్గొన్నారు.