బీచ్ లో యువకుడు గల్లంతు
iraila 26, 2021
TV77తెలుగు మచిలీపట్నం:
కృష్ణాజిల్లా, మచిలీపట్నం మంగినపూడి బీచ్ నందు యువకుడు గల్లంతు.ఆదివారం కావడంతో వివిధ ప్రదేశాల నుండి పర్యాటకులతో కిటకిటలాడుతున్న సమయంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.విజయవాడ నుండి వచ్చిన ఐదుగురు యువకులు సముద్రం లోకి వెళ్లి కొట్టుకుపోతుండగా మెరైన్ పోలీసులు గుర్తించి నలుగురు యువకులను కాపాడగా ఒకరు గల్లంతైనట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.