నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు
iraila 09, 2021
TV77తెలుగు గుంటూరు:ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతుక్కోవడంతో మోసం పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది.తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తల ఫోన్ కు వచ్చిన కాల్ షాకిచ్చింది.తాము సీఎం కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామని.మీరు చేసిన సేవలకు గాను 50 వేల రూపాయలు బహుమతిగా పంపించాలనుకుంటున్నాం అంటూ అవతల వ్యక్తులు మాట్లాడారు.మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి అంటూ అడిగారు.అన్ని డిటైల్స్ కరెక్టుగా చెప్పడంతో నిజంగానే సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి కాల్ వచ్చిందని అంతా భావించారు.కాసేపటికి ఫోన్ నెంబర్కు వచ్చిన ఓటీపీ చెప్తే.మీ ఖాతాలో డబ్బులు పడతాయని నమ్మించారు.దీంతో తమకు వచ్చిన వన్ టైం పాస్ వర్డ్ ను చెప్పడంతో చెప్పటం తో వారి అకౌంట్ లు కాళీ అయ్యాయి. ముగ్గురు ఖాతాల నుండి సుమారు లక్ష వరకూ మాయం అయ్యాయి. దీంతో వారంతా లబోదిబోమంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు