మానసిక వ్యాధికి గురైన వ్యాపారస్తుడు...
తూర్పు గోదావరి జిల్లా క్రైం బ్యూరో :
రెండు ఉభయగోదావరి జిల్లాల్లో నకిలీ విలేకరులు దొరికితే పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధం ఉంటుంది పిచ్చిమొక్కలు పుట్టుకు వచ్చినట్లు విలేకర్ల మంటూ పుట్టుకొస్తున్నారు. అక్షరం ముక్క రాని ఆవారా గాళ్ళు కూడా ఈ విలేకరి వృత్తినే ఎంచుకుని పెట్టుబడి లేని సంపాదన గా ఎంచుకున్నారు. కొందరైతే కార్లు మేడ మీద్ది సమకూర్చుకున్నారు. కొందరైతే డ్వాక్రా గ్రూపులు కరెంటు బిల్లులు కట్టుకొనుటకు నెల మామూళ్ళు పెట్టుకున్నారు.దిగజారుడు పనులకు పాల్పడుతూ విలేఖరి వృత్తికి కళంకం తెస్తున్నారు. కొందరు భయపడే బాధితుల ఇచ్చిన సమాచారం మేరకు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా చేసుకుని విలేకరుల మంటూ అర్ధరాత్రి వేళలో హైవేలపై లారీలను ఆపుచేసి వ్యాపారస్తుల కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకుని రెండు సంవత్సరాలుగా పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యంగా నల్లజర్ల భీమడోలు కొవ్వూరు తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాలలో మద్యం సేవించి హైవే పైకి రాత్రి ( టైం టు టైం) ఏడు దాటిన తర్వాత దండుపాళ్యం బ్యాచ్ విలేకర్ల మంటూ దిక్కు మొక్కు లేని పేపర్లు చానళ్లు పేర్లు చెప్పుకుంటూ ఫేక్ గాళ్ళు రెచ్చిపోయి వ్యాపారస్తుల ను బెదిరించి వాహనాలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్నారు.ఈ డబ్బు అయిపోయిన వెంటనే మళ్లీ కొత్త విలేకరులను తయారుచేసి మళ్లీ డబ్బు తీసుకున్న వారి వద్దకే వీరిని పంపించి డబ్బులు లాగుతారు డబ్బులుపెట్టుబడి లేని వ్యాపారం బాగుండడంతో అలా అలా సంతానం పెంచుకున్నారు ఇది సరిపోక కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలోకి కొందరు విలేకరులకు ఫోన్లు చేసి పలానా వాహనం పలానా నెంబర్ వస్తుంది ఆపండి మీకు మాకు సగం సగం అని పంచుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొత్తగా మరొక ఆయుధం వదిలారు అది ఎలా అంటే ఒక వాట్సప్ గ్రూపు తయారుచేసి అందులో సభ్యులుగా మిల్లర్స్ మరియు వ్యాపారస్తుల ను చేర్చుకుని.ఆర్ ఎన్ ఐ లేని.పేపర్లు ఫేక్ యూట్యూబ్ ఛానల్ వీరు సృష్టించుకుని. కాఫీ పేస్ట్ వార్తలు తయారుచేసి గ్రూపులో పెట్టి మా పేపర్ ఇంత పొడుగు మా ఛానల్ అంత పొడుగు.అని చెప్పుకుంటూ నెల మామూళ్లు ఇవ్వాలని వ్యాపారస్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇవ్వకపోయినా సమక్షంలో మీ వ్యాపారాలు పడుకుంటా యి అని ఫోన్ ద్వారా తెలుపుతున్నారు కొందరైతే భయపడి ఇవ్వక తప్పడంలేదు అని వాపోతున్నారు ఈ నకిలీ ముఠాకి ఒక మహిళను (స్టాఫ్ రిపోర్టర్ ) మేడమ్ అని పిలుస్తారు ఈ ఫేక్ గాళ్ళు రాత్రి వేళల్లో హైవేపైఆమె కారు లోనే ఉండి ఆదేశాలు జారీ చేసినట్టు తెలియవచ్చింది. ఓకే లారీని ఓకే ముఠా ఇద్దరు ఇద్దరు గా విడిపోయి మూడు చోట్ల ఆపడం జరుగుతుంది అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా నకిలీ గాళ్లు కు. ఈ నెంబర్ లారీ వస్తుంది అని చెప్తారు రాగానే వీళ్ళు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఆపడం మొదలుపెడతారు అంతే కాకుండా ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ గాళ్ళ పై వార్తలు రావడంతో సద్దు మణిగారు.అయితే రెండు నెలలు ఆగి మళ్లీ కుక్క తోక వంకర రానట్లే బుద్ధి కూడా మారలేదు, ఇలాంటి వారిపై తక్షణమే అధికారులు గుర్తించి వీళ్ళ పై కేసులు నమోదు చేయాలని వీళ్లను కట్టడి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని వీళ్లతో పాటు అక్రమ వ్యాపారస్తుల ను కూడా గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని విలేకరి సంఘాలు మరియు ప్రజలు కోరుకుంటున్నారు.