ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు
iraila 17, 2021
TV77తెలుగు కర్నూలు:
కర్నూలులో ఓ యువతిని మారు పేరుతో బీటెక్ స్టూడెండ్ మోసం చేశాడు.బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తికి విద్యార్థి అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యువతుల మొబైల్ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్‌లో పడేసి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. అతడు అన్వేష్ అనే వ్యక్తిగా ఒకరితో,భరత్ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్ అనే పేరుతో ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి వివాహమైంది.. ఆమె ఫొటోలను వాట్సాప్‌లో ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరించాడు. బాధితులురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని కర్నూలు కలెక్టరేట్ దగ్గర గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.