పోలీసుల అదుపులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా

TV77తెలుగు విజయవాడ: పోలీసులకు చిక్కింది.సౌదీ నుండి విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఈ ముఠాను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.వాయు,జల మార్గాల ద్వారా వెంకట రాఘవేంద్రరావు అనే వ్యక్తి బంగారాన్ని తెస్తున్నట్టు పోలీసులు తెలిపారు.రాఘవేంద్రరావు తెచ్చిన బంగారాన్ని నగరానికి చెందిన వెంకటేశ్వరరావు,పీఎస్ నాగమణి విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి రాఘవేంద్రరావు గ్యాంగ్ ఆరు కోట్ల రూపాయల మేర విజయవాడ సహా కృష్ణాజిల్లాలో పలువుర్ని మోసం చేసినట్టు తెలుస్తోంది.ఇలా మోసపోయిన వారిలో రైల్వే టీసీలు,దుర్గ గుడి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.నగదు తీసుకుని బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.కిడ్నాప్ డ్రామా ఆడి బాధితులపై పోలీసులకు నాగమణి ఫిర్యాదు చేయడంతో ఈ దందా గుట్టురట్టైంది.బంగారం స్మగ్లింగ్ బయట పడడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.ప్రధాన నిందితుడు రాఘవేంద్రరావు తో సహా వెంకటేశ్వరవు, నాగమణి లను విచారిస్తున్నారు.ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం...