ఇద్దరు చిన్నారులు వాగు దాటుతూ గల్లంతు

TV77తెలుగు దేవీపట్నం: దేవీపట్నం మండలం కొండమోదలు పంచాయతీ బడిగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కొండవాగు దాటుతుండగా ఇద్దరు గిరిజన చిన్నారులు గల్లంతయ్యారు. ఆధార్ కార్డుల పనిపై రంపచోడవరం వెళ్ళివస్తుండగా ప్రమాదం జరిగింది. వర్షాల కారణంగా ఆకూరు - బడిగుంట గ్రామాల మధ్య కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ తల్లులతో పాటు పొడియం గణేష్ దొర, వెట్టి వంశీ దొర అనే ఇద్దరు చిన్నారులు వాగు దాటుతూ జారిపడి గల్లంతయ్యారు...