భారీ వర్షాలు అలర్ట్
iraila 03, 2021
TV77తెలుగు తెలంగాణ:
రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకున్న వరుణుడు గురువారం నుంచి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న రాత్రి 7-10 గంటల మధ్య కురిసిన భారీ వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది.ఆకస్మాతుగా ముంచెత్తిన వర్షానికి నగర ప్రజలు,వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాలు,కాలనీలు నీట మునిగాయి.అయితే ప్రజలను వణికించేలా వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది.తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.అనేక ప్రాంతాల్లో శుక్రవారం తేలిక పాటి నుంచి మోస్తరు,శనివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఈ నెల 6వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దాని ప్రభావంతో 4-5 రోజులు హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవుతున్నారు.