మైలవరం మండల పరిషత్ కీలక పదవులలో మహిళలకే అగ్రతాంబూలం...!!
మండల ఎంపిపి పదవులను కైవసం చేసుకున్న మహిళా శక్తి...!!!
రేపు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మండల పరిషత్ నూతన పాలక వర్గం...!!
TV77తెలుగు మైలవరం:మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడటం తో మైలవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు వైసీపీ వశమయ్యాయి.. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి మండల పరిషత్ లను కైవసం చేసుకున్నారు.. అయితే ఫలితాల అనంతరం మండల పగ్గాలు ఎవరికి దక్కుతాయో అన్న చర్చకు ఎమ్మెల్యే వసంత నేటితో శుభం కార్డ్ వేశారు... నియోజక వర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో కీలకమైన ఎంపిపి పదవులను ఈ సారి మహిళలు కట్టబెట్టారు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక పదవుల నియామకాల్లో వైసీపీ ప్రభుత్వం మహిళకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది...ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మండల పరిషత్ పదవులను మహిళకు అప్పగించారు.మైలవరం నియోజక వర్గ పరిధిలోని రెడ్డిగూడెం మండల ఎంపిపి గా రామినేని దేవీప్రవణ్య, మైలవరం ఎంపిపి గా ఇస్లావత్ ప్రసన్న రాణి, జీ కొండూరు మండలం ఎంపిపి గా వేములకొండ తిరుపతమ్మ , ఇబ్రహీంపట్నం మండలం ఎంపిపి గా పాలడుగు జ్యోత్స్న లను మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకు ఎమ్మెల్యే వసంత ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. రేపు జరగబోయే ఎంపిటిసి ల ప్రమాణ స్వీకారోత్సవం లో ఎంపిపి లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు..
సత్య...
రిపోర్టర్,
మైలవరం..