ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది
iraila 08, 2021
TV77తెలుగు అమరావతి:
రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని. అయితే, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అలాగే, పబ్లిక్ స్థలాల్లో చవితి ఉత్సవాల నిర్వహణ తీరుపై జగన్ సర్కారు చర్యలను హైకోర్టు సమర్థించింది. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని,ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు
సమర్థించింది. అలాగే, ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.