అమెరికాకు పర్యాటకులు వెళ్లవచ్చు

 

TV77తెలుగు: ఇక అమెరికా కు కూడా ఆయా దేశాల పర్యాటకులు వెళ్లవచ్చు. ఈ మేరకు ఆ దేశం ప్రకటన చేసింది. అయితే కొన్ని ఆంక్షలను పాటించవలసి ఉంటుంది. కోవిడ్ టీకాలు వేయించుకున్నవారికి అమెరికాకు రావడానికి అనుమతి ఇస్తారు. వాక్సినేషన్ చేయించుకున్నట్లు దృవపత్రాలు ఉండాలి. అలాగే అమెరికా విమానం ఎక్కడానికి మూడు రోజుల ముందు కోవిడ్ టెస్టు చేయించుకుని నెగిటివ్ రిపోర్టు రావల్సి ఉంటుంది. మాస్క్ లను తప్పనిసరిగా ధరించవలసి ఉంటుంది. నవంబర్ నుంచి ఈ విధానం అమలులోకి రానుందని అమెరికా ప్రకటించింది. భారత్ తో సహా వివిధ దేశాలకు ఈ అనుమతి ఇస్తున్నారు. కాగా అమెరికా పౌరులు విదేశాల నుంచి వస్తే ఇవే నిబందనలు వర్తిస్తాయని తెలిపింది.