ఘోర అగ్నిప్రమాదం

TV77తెలుగు కృష్ణా: కృష్ణా జిల్లాలోని నిడమానూరు సమీపంలో ఆస్ట్రల్ పైప్స్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థానికి చేరుకున్నారు. దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ఎంత నష్టం జరిగిందన్న సమాచారం అందాల్సి ఉంది.