రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వ్యవహార శైలి మారాలి కంటే వినయ తేజ
iraila 16, 2021
TV77తెలుగు కోరుకొండ:
రాజానగరం నియోజకవర్గం సంబంధించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ తీరు మార్చుకోవాలని కోరుకొండ మండలం యువ నాయకులు కంటి వినయ్ తేజ పేర్కొన్నారు.గురువారం నాడు కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం నందు ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీకి సంబంధం లేని ఒక వ్యక్తి గురించి రాజమహేంద్ర పార్లమెంటు సభ్యులు హుటాహుటిన తిరుపతి నుండి వచ్చి సీతానగరం వెళ్లి ఆయన పరామర్శించడం చూస్తుంటే రాజానగరం నియోజకవర్గంలో కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారన అనుమానం కలుగుతుందన్నారు.తూర్పుగోదావరి జిల్లాలోనే అభివృద్ధి పనులలో రాజానగరం నియోజకవర్గం ముందుకు దూసుకుపోతున్న సమయంలో కనీసం ఏటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకుండా ఆరోపణలు చేయడం సమంజసమైన అని ఆయన ప్రశ్నించారు.
రాజానగరం నియోజకవర్గంలో ఉభయగోదావరి జిల్లాలకే తలమానికమైన జగన్మోహన్ రెడ్డి గారి కలల ప్రాజెక్టు 50 వేల గృహ సముదాయాల కల్పన ఆవ భూముల విషయంలో తమపై ఎన్నో ఆరోపణలు వచ్చిన సమయంలో ప్రతిపక్షాలు చలోక్తులు విసురుతున్న సమయంలో మౌనంగా ఉండకుండా ఆనాడే బదులు ఇచ్చి ఉంటే మీపై నమ్మకం మరింత పెరిగిందన్నారు.చిన్న చిన్న విషయాలకే మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే కార్యకర్తలందరూ అయోమయానికి గురవుతునన్నారు. తమరు మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే మేము కూడా ఎంతో సంతోషిస్తామన్నారు.జగన్ మోహన్ రెడ్డి మీపై ఎంతో నమ్మకంగా ఉంచి అత్యున్నత సభకు ప్రభుత్వ విప్ పదవి ప్రకటిస్తే, మీరు మాత్రం ఆ పదవికే మచ్చ తెచ్చినట్లుగా క్రమశిక్షణ రహిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడం చూస్తుంటే మీపై మాకున్న నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.సీతానగరం మండలం పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం గురించి స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా సంవత్సన్నర ముందే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై లెక్చరర్ తో కలిసి పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ తీరు చూస్తుంటే ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు.నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో రాజానగరం నియోజకవర్గంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటే మీరే కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారమో అన్న అనుమానం కలుగుతుందన్నారు
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజానగరం నియోజకవర్గం అటు సచివాలయ నిర్మాణంలోను, రైతు భరోసా కేంద్రం నిర్మాణంలోను, వైయస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణంలోనూ మిగతా నియోజకవర్గాల కంటే అభివృద్ధి పనులలోఎంతో ముందునామన్నారు.ఈ అభివృద్ధి పనులు మీకు కనపడటం లేదా? మంచి చేస్తే మీకు కనపడటం లేదా? ఎవరో ఏదో అంటే దానికి మీరు వత్తాసు పలకడం చూస్తుంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
గతంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా ఎంతో మంది పని చేశారని ఏనాడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు.ఇంకనైనా మీరు వెళ్లి వచ్చిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన మీ యొక్క తీరు మారాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామన్నారు.