ఎంపీటీసీ దంపతులు మృతి
iraila 01, 2021
TV77తెలుగు హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ దాటిన తర్వాత పెద్దంబర్‌పేట సమీపంలో ఉన్న యూ టర్న్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ వెనక నుంచి బలంగా గుద్దింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఎంపీటీసీ కవిత, ఆమె భర్త, టీఆర్‌ఎస్ పార్టీ నేత అయిన వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదంలో మృతి చెందిన వారు నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులుగా గుర్తించారు..