తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి అధికారులు

TV77తెలుగు మంగళగిరి: తాడేపల్లి నగరపాలక సంస్థ పరిది పెదవడ్లపూడి లో తెలంగాణ కు చెందిన మధ్యంను విక్రయిస్తున్నారనే సమాచారం తో సిఐ మారయ్య బాబు అద్వర్యంలో దాడులు నిర్వహించారు . ఈ దాడిలో షేక్ నాగబాబు అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 25 మాన్సినోస్ (బ్రాండ్) అనే తెలంగాణ మద్యం బాటిళ్లను ఎస్ఈబి సిఐ మారయ్య బాబు అద్వర్యంలోని సిబ్బంది స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు . అక్రమంగా ఇతర ప్రాంతాల్లో మద్యం తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్ఈబి సిఐ మారయ్య బాబు హెచ్చరించారు .