మండల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు అనుమతి
iraila 17, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు అనుమతించిన
నేపధ్యంలో సంబందిత ఓట్ల లెక్కింపునకు అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టం గావించాలని సబ్ కలెక్టరు ఇలాక్కియా
రిటర్నింగ్ మరియు సహాయ రిటర్నింగు అధికారులను ఆదేశించారు. శుక్రవరం ఆమె స్థానిక సబ్ కలెక్టరు
కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సంబందించి తక్కువ సమయంలో నోటిఫికేషన్
విడుదల అయినందున అధికారులు త్వరిగతిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం
ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. అన్నివిధాల ఏర్పాట్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు
అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూములనుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు బారికేడింగు
ఏర్పాటు చేయాలని, సి.సి కెమెరాలు ఏర్పాటుతోపాటుగా వెబ్ కాస్టింగులు నిర్వహించాలని ఆదేశించారు.
అన్ని చోట్ల నిర్వహిస్తున్న విధులకు సంబందించి అందరికి తెలిసేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని
అదేవిధంగా ట్రేల మీద అభ్యర్థులు వివరాలు తెలిసేలా స్టిక్కర్లు అతికించాలన్నారు. స్ట్రాంగ్ రూములనుంచి
బ్యాలెట్ బ్యాక్సులు తరలించేందుకు వీలుగా రవాణా ఏర్పాటు చేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు
నోటీసులు అందించడంతోపాటుగా వారి తరపున హాజరుకాబడే వారి పాస్పోర్టు సైజు పోటో తీసుకుని
రావాలని చరవాణి ద్వారా కూడా సమాచారాన్ని అందించి తెలపాలన్నారు. అదేవిధంగా రెండు డోసులు
వ్యాక్సిన్ వేయించుకున్న దృవపత్రాలు తీసుకొని రావాలన్నారు. కోడిడ్-19 పరీక్షలలో అభ్యర్థి, వారి ఏజెంటుకు జ్వరపీడిత కరోనా సింటమ్స్ లక్షణాలున్న యెడల కౌంటింగ్ కు అనుమతించరాదని వారి తరపున వేరే ఏజెంటును నియమించాలని సూచించారు. ఒక పార్టీకి ఒక అభ్యర్థిని మాత్రమే అనుమంతించాలన్నారు. ఒక ఓట్ల లెక్కింపు టేబుల్ కు ఒక సూపరువైజరు ఒక సహాయకుడిని నియమించాలన్నారు. డివిజన్ కు సంబందించి ఓట్ల లెక్కింపు అంతా గ్రామీణ మండలంలోని జాతీయ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్చన్సు (నేక్) కేంద్రం నందు స్ట్రాంగ్ రూమ్ లు,
కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఆలమూరు మండలానికి సంబందించి 64 పోలింగ్ కేంద్రా
లకుగాను మొదటి అంతస్తు రూమ్ నెంబరు 38ని ఎంపిక చేసామని, గోకవరం మండలాలనికి సంబందించి
51 పోలింగ్ కేంద్రాలకుగాను మొదటి అంతస్తు రూమ్ నెంబరు 36ను, కడియం మండలానికి సంబందించి
75 పోలింగ్ కేంద్రాలకుగాను మొదటి అంతస్తు రూమ్ నెంబరు 45ను, కోరుకొండ మండలానికి సంబందించి
61 పోలింగ్ కేంద్రాలకుగాను మొదటి అంతస్తు రూమ్ నెంబరు 39ను, రాజానగరం మండలానికి సంబందించి
65 పోలింగ్ కేంద్రాలుగాను మొదటి అంతస్తు రూమ్ నెంబరు 44 ను. సీతానగరం మండలానికి సంబందించి
74 పోలింగ్ కేంద్రాలకుగాను మొదటి అంతస్తు రూమ్ నెంబరు 37 ను కేటాయించడం జరగిందన్నారు.
వెరసి 390 పోలింగ్ కేంద్రాలకుగాను ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు నేక్ కేంద్రంలో చేపట్టామన్నారు. కౌంటింగ్
టేబుల్స్ వీలైనన్ని ఏర్పాటు చేసుకొని ఓట్ల లెక్కింపు ప్రక్రియను త్వరితగతిన ముగించి ఫలితాలు వెల్లడికి
చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం 5 ఎంపిటిసి, 5 జడ్ పిటిసి టేబుల్స్ చొప్పున ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు
చేయాలని ఆమె ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి రిటర్నింగు అధికారి వారి సంతకంతో నియామాకపు
నోటీసులు అందించాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించాలని, తదుపరి బ్యాలెట్ బ్యాక్సులలో
ఓట్ల లెక్కింపును ప్రారంబించి 25 ఓట్ల బండిల్స్ గా విభజించుకోవాలని, లెక్కింపు సిబ్బందిని 20 శాతం
రిజర్వుగా నియమించి కౌంటింగ్ కేంద్రం వద్దే ఉంచుకోవాలన్నారు. పబ్లిక్ అడ్రసు సిస్టమ్ ద్వారా రౌండ్
రౌండ్ కి ఫలితాలు వెల్లడించాలన్నారు. వెంటనే ఆ..లు, ఎఆర్ఓలు కౌంటింగ్ కేంద్రాలు సందర్శించి ఓట్ల
లెక్కింపు కొరకు ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షించుకోవాలని ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని
ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయంగా జనరేటరును ఏర్పాటు
చేసుకోవాలని ట్రాన్సుకో అధికారులను ఈనెల 19న విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా
నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. రిటర్నింగు అధికారులు ఎంతో
సంయమనంతో వ్యవహరించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా లెక్కింపు
ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూగర్భజల శాఖ డిడి విజయకుమార్,
డివిజనల్ పంచాయితీ అధికారి జె సత్యనారాయణ, ఎంపిడికలు, తాహసిల్దార్లు పోలీసు ఉన్నతాధికారులు
తదితరులు పాల్గొన్నారు.