మానవత్వం చాటుకున్న పోలీసులు

TV77తెలుగు ముమ్మిడివరం: తూ.గో ముమ్మిడివరం నుండి మోటార్ సైకిల్ పై మురమళ్ల వెళుతున్న రావులపాలెం మండలం ఈతకోట కు చెందిన పి.సుబ్బరాజు అనే వ్యక్తిని చేపల లోడుతో వెళ్తున్న బొలోరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.గాయపడిన వ్యక్తిని 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో పోలీసులు హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ నాగరాజు, కానిస్టేబుల్ మణికంఠ సహాయంతో మెరుగైన వైద్య సేవలు కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కు తరిలించారు.హుటాహుటిన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించిన కానిస్టేబుల్ మణికంఠ హోమ్ గార్డ్ నాగరాజు లను స్థానికులు అభినందించారు..