TV77తెలుగు రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా రిటైరైన పోలీస్ అధికారులు మరియు చనిపోయిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యుల సంక్షేమ నిమిత్తం మరియు బెనిఫిట్లు త్వరగా అందేందుకు "పోలీసు వెల్ఫేర్ డే". బుధవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం, కాన్ఫరెన్స్ హాల్ నందు అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (లా &ఆర్డర్) కె.లతా మాధురి మరియు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. పాపారావు అధ్యక్షతన రిటైరైన పోలీస్ అధికారులు, చనిపోయిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులకు "పోలీసు వెల్ఫేర్ డే" ను నిర్వహించినారు, ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... 30, 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి రిటైరైన అధికారులను మరియు చనిపోయిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులను గౌరవించుకోవడం మానవతా దృక్పథం అని చెప్పారు. అలాగే రిటైర్ అయిన అధికారులకు, చనిపోయిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులకు అందాల్సిన అన్ని రిటైర్‌మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకం కూడా త్వరగా వచ్చేలా సహాయం చేయడానికి సాయి శక్తుల పని చేస్తాం అని తెలియజేశారు. అలాగే రిటైరైన ఎంప్లాయిస్ గ్రీవెన్స్ పరిష్కారం కొరకు వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తామని, వారికి ఎలాంటి బెనిఫిట్స్ కూడా పెండింగ్ లేకుండా చేస్తామని భరోసా కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్, డి.పి.ఓ సిబ్బంది, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.రఘురాం మరియు రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ మరియు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.