కొత్తపల్లి లో చైనా వైద్యుడు నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

కొత్తపల్లి లో చైనా వైద్యుడు నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

 కన్నవారికి కడుపుకోత మిగిల్చిన వైద్యుడి నిర్లక్ష్యం పై గ్రామస్తులు ఆగ్రహం

 మండల వైసిపి నాయకుని జోక్యంతో ఇరువర్గాలు రాజీ

పోలీస్ కేసు నమోదు కాకుండా మేనేజ్

 TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్ ప్రతినిధి: 
వృత్తి నైపుణ్యం, అనుభవం, సబ్జెక్టు పై పూర్తి అవగాహన ఉండాల్సిన వైద్య వృత్తిలో నేటితరం డబ్బే ప్రధానంగా రోగుల , ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలను గాలికి వదిలేయడం సర్వత్ర జరుగుతున్న పరిణామాలే. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా తూతూమంత్రంగా హడావిడి చేయడం ప్రభుత్వ శాఖలకు షరా మామూలుగా తయారయింది . దాంతో వైద్యులపై నియంత్రణ లేకపోవడంతో వైద్య వృత్తిలో ఇష్టారాజ్యం నెలకొంది. ఒక యువ వైద్యుని నిర్లక్ష్యం , తప్పుడు వైద్య చికిత్స ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకోగా, చిన్నారి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. 
ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో సంవత్సరం కిందట శ్రీ రామ సత్య క్లినిక్ ను డాక్టర్ కృష్ణ చైతన్య అనే యువ వైద్యుడు ప్రారంభించారు . వైద్య విద్యను చైనాలో దేశంలో చదువుకుని నేరుగా గ్రామంలో సొంత ఇంట్లో వైద్యవృత్తి ప్రారంభించారు. గత 15 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన పోతుల దుర్గాప్రసాద్ నాలుగేళ్ల కుమార్తె శ్రీవల్లి ని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్పించారు . పదిహేను రోజుల పాటు చికిత్స చేసినప్పటికీ చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రుల, బంధువులు, గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేసింది .దాంతో ఆసుపత్రి నిర్వాహకులతో ఘర్షణ జరిగింది. గడువు ముగిసిన మందులు ఇచ్చారని దాంతోనే చిన్నారి మృతి చెందిందని వాదన వినిపిస్తుంది . వైద్యునికి అనుభవం లేదని , సరైన చికిత్స అందించక వైద్యుని నిర్లక్ష్యమే చిన్నారి ప్రాణాలను బలిగొందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో చైనా వస్తువులకు నాణ్యత ,మన్నిక లేనట్లుగానే అక్కడ చదివిన వైద్య విద్యలోనూ ప్రమాణాలు అంతంత మాత్రమేననే అనుమానం ఈ సంఘటన రుజువు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ సంఘటన పై సమాచారం తెలుసుకున్న గ్రామానికి చెందిన మండల వైసిపి నాయకుడు రంగ ప్రవేశం చేసి చిన్నారి బంధువులను, తల్లిదండ్రులను, వైద్యుని వర్గాల మధ్య రాజీ చేశారని, లక్షల రూపాయలను బాధితులకు ఇప్పించారని, ఆ మేరకు పోలీసు కేసు నమోదు కాకుండా మ్యానేజ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా వైద్య విద్య అనంతరం కొంతకాలం పాటు వైద్యరంగంలో ప్రాక్టీస్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కోరుతున్నాయి . వైద్యులపైన, ఆస్పత్రిల పైన దాడులు చేస్తే పోలీస్ కేసులు పెట్టవచ్చుననే చెబుతున్న చట్టం , అదే మాదిరిగా రోగులకు సరైన చికిత్స అందించ కుండ విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్న వైద్యులనిర్లక్ష్యం పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.