రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై ప్రత్యేక డ్రైవ్

TV77తెలుగు కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు, IPS. స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా" ప్రమాదాల లేని రోజు"" గా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు. తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రతి మంగళ వారం మరియు శనివారాలలో ప్రమాద రహిత దినం గా పాటిస్తున్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా జిల్లా పోలీసులు ప్రమాదకర రోడ్డు మలుపులు, జాతీయ హైవే లపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో, హైవే లపై పబ్లిక్ రోడ్డు క్రాసింగ్ కూడళ్ళ వద్ద పోలీసు అధికారులు ,సిబ్బంది వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ డ్రైవ్ సందర్భంగా రోడ్లపై వాహన చోదకులకు అడ్డంకులుగా వుండే పెద్దచెట్ల కొమ్మలను,రోడ్డ్ల మలుపుల్లో ఉన్న చెట్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని పోలీసులు చేపడుతున్నారు.శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ, వాహన చోదకులకు నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాన్ని కౌన్సిలింగ్ నిర్వహించి తెలియచేస్తున్నారు.