మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై స్పందించిన జగన్

TV77తెలుగు కడప: మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో మాట్లాడిన ఆయన ఈ సంఘటనపై దర్యాప్తు చేయించాలని వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్ లకు ఆదేశించారు. అంతేకాక వారంలోగా మైదుకూరు గ్రామీణ సిఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వివాదాస్పద భూమికి సంబంధించి వారం రోజుల్లో కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.