అక్రమంగా నాటుసారా తయారు
iraila 09, 2021
TV77తెలుగు గోపాలపురం:
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జయ రామరాజు యొక్క ఆదేశాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ బి.వేంకటేశ్వర రావు రాబడి న సమాచారము పై అనగా 09.09.2021 వ తేది నాడు ఎస్. ఇ.బి ఇన్స్పెక్టర్ ఎస్ఐ అది నారాయణ మరియు సిబ్బందితో బుచ్చయ్య పాలెం గోపాలపురం మండలం లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 400 లీటర్ల నాటుసారా 8 అల్యూమినియం సామాన్లను స్వాధీనం చేసుకుని నాటుసారా తయారీకి ఉపయోగించే 4400 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేసి, సదరు ముగ్గురు వ్యక్తులు పై తదుపరి చర్యలు తీసుకునే నిమిత్తంగా గోపాలపురం పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్ వో అప్పగించినట్లు గా ఎస్. ఇ.బి ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వరు తెలియజేసినారు.