నిర్లక్ష్యం ఖరీదు పసిమొగ్గు బలి...!!!
మున్సిపల్ అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలుడు డెంగీ తో మృతి..??
కొండపల్లి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణి పై కట్టలు తెంచుకుంటున్న ప్రజా ఆగ్రహం .....!!!
పారిశుధ్యం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం లో అధికారులు విఫలం అవుతున్నారని వెల్లువెత్తతున్న ఆరోపణలు....!!!
అధికారులు సకాలం లో చర్యలు తీసుకొని ఉంటే అమాయక ప్రాణాలు పోయేవి కాదంటూ వాఖ్య....!!!
TV77తెలుగు కొండపల్లి:
కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృoభిస్తున్నా సరే అధికారుల్లో మాత్రం అదే నిర్లక్ష్యం.. డెంగీ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నా సరే నివారణ చర్యలు తీసుకోవడం లో నిలువెత్తు నిర్లక్ష్యం.. విష జ్వరాలతో ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అని ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు అనేది ప్రజల ఆరోపణ... డెంగీ జ్వరాలు వ్యాప్తి పెరుగుతుంది అని ప్రతీకలు గోషించినా, ప్రజలు మొర పెట్టుకున్నా అధికారుల్లో చలనం మాత్రం రావడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో కొండపల్లి కి చెందిన ఐదేళ్ల బాలుడు డెంగీ జ్వరం మృతి చెందినట్లు వార్తలు రావడం తో ప్రజల్లో అసహనం పెల్లుబికింది... ప్రజల ఆరోగ్యానికి చర్యలు తీసుకోలేని వ్యవస్థలు , ప్రభుత్వాలు ఎందుకంటూ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు... ఇదే విషయం పై ప్రభుత్వ వైద్య శాఖ అధికారులను వివరణ కోరగా డెంగీ జ్వరాలు, కొండపల్లి లో ఒకటి మాత్రమే ఉందని...బాలుడు డెంగీ జ్వరంతో చనిపోయినట్లు తమకు సమాచారం లేదని చెబుతున్నారు... డెంగీ జ్వరాలు ఉన్నా లేకున్నా సాధారణ విష జ్వరాలు సైతం ప్రాణాలు తోడేస్తున్న పరిస్థితి నెలకొంది...ఈ క్రమంలో ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది....
సత్య...
రిపోర్టర్
మైలవరం