స్పందన వేదికను నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు

TV77తెలుగు కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు “స్పందన” కార్యక్రమం లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల వద్ద నుండి జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబు ఫిర్యాదులను ప్రత్యేక్షంగా స్వీకరించారు, వారి సమస్యలను విని, సంబంధిత పోలీస్ అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించ వలసిందిగా ఆదేశాలను జారీ చేసారు.