ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలకు అభినందన సభ
iraila 14, 2021
TV77తెలుగు ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు లోని రాజీవ్ సర్కిల్ నందు ఎన్జీవోస్ భవనము నందు జరిగిన ఉత్తమ సేవలకు అభినందన కార్యక్రమంలో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సత్యనారాయణ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పొద్దుటూరు పట్టణ టూ టౌన్ సిఐ నరసింహా రెడ్డి, టూ టౌన్ కానిస్టేబుల్ కి గంగ రాజు , త్రీటౌన్ కానిస్టేబుల్ జి బాబు ఉత్తమ సేవలు అందించినందుకు ఎమ్మెల్సీ రమేష్ సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవ చేసే, రక్షణగా ఉండే పోలీసులకు సన్మానించడo నిజంగా నా అదృష్టం గా భావిస్తున్నాను అని ఆయన తెలియజేశారు.పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ గత కరోనా కాలంలో ఎంతో మంది పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం లో చాలా మంది పోలీసులు ప్రాణాలు పోయాయని అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి తొలి డోసు లను వారికి వేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు.అలాగే దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో తొలిసారిగా దిశ అనే వ్యవస్థ తీసుకుని వచ్చి బాధితులకు అండగా నిలిచే కార్యక్రమం చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.అలాగే సన్మానం స్వీకరిస్తున్న నరసింహ రెడ్డి,అలాగే కానిస్టేబుల్ బాబు ,గంగ రాజుగారి సాహసాలను ఎమ్మెల్సీ రమేష్ కొనియడడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సత్యనారాయణ ని ఆయన అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ తో పాటు వన్టౌన్ సిఐ నాగరాజు కూడా పాల్గొనడం జరిగింది.