గులాబ్ తుఫాన్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా

TV77తెలుగు అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా తీసారు.కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తమైంది.తుఫాన్‌ అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని జగన్‌ ఆదేశించారు.గ్రామ సచివాలయాల వారీగా ఎప్పటికప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.