పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
iraila 14, 2021
TV77తెలుగు ఒడిశా:
ఒడిశాలో ఓ సరుకు రవాణా రైలు ప్రమాదానికి గురైంది. ఫిరోజ్‌నగర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న సరుకు రవాణా రైలు. ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో పట్టాలు తప్పింది.ఈ ప్రమాదంలో రైలులోని 9 వ్యాగన్‌లు బోల్తాపడ్డాయి.మరో వ్యాగన్ పట్టాలు తప్పి నిలిచిపోయింది. మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ నది వంతెనపై రైలు పట్టాలు తప్పిందని, అయితే రైల్లోని ఒక్క వ్యాగన్ కూడా నీళ్లలో పడలేదని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.