బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు అభినందనీయం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
iraila 09, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా సేవారంగంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలు అభినందనీయమని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
గురువారం నాడు ప్రకాష్ నగర్ స్వగృహం నందు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కు వీల్ చైర్స్ బహూకరణ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో వినియోగదారులందరికీ నాణ్యమైన సేవలు అందిస్తూ ఖాతాదారుల మనసును చురగోనడం జరిగిందన్నారు.కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా బ్యాంకు ద్వారా మరిన్ని సేవలు అందించాలనే సదుద్దేశంతో బ్యాంక్ వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన అన్నారు.జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఆర్థిక స్తోమత తో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారిని గుర్తించి ఈ వీల్ చైర్స్ అందించడం
జరుగుతుందన్నారు.దివంగత నేతలైన డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి మరియు జక్కంపూడి రామ్మోహన రావు ఆశయాల మేరకు జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్.జేజేశ్వర రావు, ఏరియా మేనేజర్ సోమ సుందర రావు మరియు ఇతర బ్రాంచ్ మేనేజర్లు, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ సభ్యులు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు