సాధన దిశగా మరో పోరాటానికి సిద్ధం గా ఉన్నాము
ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసూరిపాటి
బ్రహ్మయ్య మాదిగ
TV77తెలుగు రాజమహేంద్రవరం:
స్థానిక గేదెలు నూకరాజు కళ్యాణమండపం నందు ఈ రోజు మధ్యాహ్నం నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సమావేశం దిగ్విజయంగా జిల్లా నలుమూలల నుండి కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా రాష్ట్ర అధ్యక్షులు ఉసూరిపాటి బ్రమ్మయ్యా మాదిగ పాల్గొన్నారు.సభ అధ్యక్షులు గా మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జాతీయ నాయకులు దూలపల్లి సుబ్బారావు మాదిగ సభను నడిపించారు.
ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూమరో ఉద్యమాన్ని నిర్మించడం కోసం ముందుకు వెళ్లే క్రమంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసాము అని అలాగే పూర్తి నిర్మాణ భాద్యతలు చేసే క్రమంలో జిల్లా కమిటీ ని భలోపేటనం చేసే దిశగా కొనసాగితుంది అని ఆయన అన్నారు. దాదాపు రాయలసీమ జిల్లాలో నాలుగు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లా కి ఈరోజు పదవ జిల్లాగా సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశంలో పెద్దలు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి డాక్టర్ దూలపల్లి సుబ్బారావు ముక్యులు పాల్గొనడం అలాగే, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రావడం జరిగింది .కార్యకర్తలతో చర్చించి రేపు 24 తారీకు జాతీయ సమావేశం హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాదులో మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ నిర్ణయం మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వర్గీకరణ సాధన సభ మరో పోరాటానికి సంయుక్త నవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటాన్నాము.మంద కృష్ణ మాదిగ ఉద్యమ ఫలితం ఆనాటి ఉచితంగా వైద్యం చేయాలని పోరాటం అది కాస్త ఆరోగ్యశ్రీ పథకం గా మారింది. సాక్షాత్తు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం వల్ల ఈ పథకం వచ్చిందని అసెంబ్లీలో స్వర్గీయ వై. ఎస్ రాజశేఖర్ చెప్పిన విషయాలు మేము గుర్తు చేస్తూ ఉన్నాము. అంతేకాదు 2007లో వికలాంగుల కోసం యుద్ధం చేసాము పెన్షన్ పెరగాలని 2013లో వృద్ధుల వితంతువులకు పెన్షన్ పెరగాలని యుద్ధం చేసాము ,వాటితో పాటు ఎస్సీ ఎస్టి ఉద్యోగులకు ప్రమోషన్ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలని అంతే కాకుండా ఎస్సీ. ఎస్టీ చట్టాన్ని సుప్రీం కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయకుండా లేకుండా చేసిన కుట్ర చేసినప్పటికీ కూడా చట్టాన్ని తిరిగి సాధించడం కోసం ఢిల్లీ వ్యాప్తంగా ఉద్యమం నడిపిన ఎమ్మార్పీఎస్ ఈ రోజు ఈ చట్టాన్ని మరలా తిరిగి సాధించడం ఈ విషయాన్ని కూడా మరల గుర్తు చేస్తూన్నాము ఇది కూడా మా పోరాటాల ఫలితం అని
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 25 సంవత్సరాలుగా తన జాతి హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్నటువంటి అందరి కోసం కూడా ఉద్యమం చేస్తా ఉంది. కనుకనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అది మానవ జాతి ఉద్యమంగా మారిందని తెలియజేసుకుంటూ, అయితే అదే క్రమంలో సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలలో ఎస్సీలను కలపాలన్న తీర్పు ఏదైతే ఉందో అదే సుప్రీంకోర్టు మరల తిరిగి 2020 ఆగస్టు 27 వ తారీఖున 2004 నాటి తీర్పును ఆధారంగా పరీక్షించండి, ఆ తీర్పు రాష్ట్రాలకు రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ ఆ రిజర్వేషన్ సక్రమంగా దాని ప్రకారంగా కూడా అమలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పడం తో పాటు ఆ రోజు ఇచ్చిన తీర్పు లో చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిని పున సమీక్షించ వలసిన అవసరం ఉందని చెప్పి గత సంవత్సరం ఆగస్టు 27 వ తారీఖున తీసుకురావడం జరిగింది.దీనిలో. చెప్పినట్టు ధర్మం న్యాయం మావైపు ఉన్నాయి కనుకనే సుప్రీంకోర్టు అన్నదో అదే సుప్రీంకోర్టు పున సమీక్షించాల్సిన చెయ్యాలని ఆ రోజు కృష్ణ మాదిగ కోరడం జరిగింది. దానిని స్వాగతిస్తూ అనేక సందర్భాలలో అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్న ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తున్నామని సందర్భాన్ని గుర్తు చేస్తున్నాము.వాటన్నిటిలో తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదంటే అన్ని రాజకీయ పార్టీ కు వర్గీకరణకు సి.పి.ఐ, సి.పి.ఎం వాటి అన్నిటి కంటే ప్రధానంగా ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని అనేక సందర్భాల్లో తెలియజేసారు అంతే కాకుండా ఆ పార్టీ పెద్దలు వెంకయ్య నాయుడు కూడా వర్గీకరణ ఉద్యమం 94 లో మొదలైంది కానీ 94 కంటే ముందు 82 లోనే అసెంబ్లీలో వర్గీకరణ జరగాలని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ రోజు నుండి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పడంతో పాటు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి దగ్గరుండి మొడలుకుంటే అమిత్ షా తో పాటు అనేక మంది పెద్దలు వర్గీకరణను సమర్థిస్తూ బి.జె.పి కూడా ముందుకు సాగే అదే క్రమంలో ఈరోజు కేంద్రంలో కూడా బిజెపి అధికారంలో ఉంది గనుక తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని బిజెపి చెప్పింది కనుక ఈరోజు వర్గీకరణ బిల్లు విషయం లో సత్వరమే పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని మేము విజ్ఞప్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆయన మేము చేస్తున్న ఈ ప్రయత్నాలు ఉద్యమ భాటగా సాగుతుంది అని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముమ్ముడి వరపు చిన సుబ్బారావు,వైరాల అప్పారావు,మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ నాయకులు కొత్తపల్లి ప్రసాద్ ,జిల్లా ప్రస్తుత ఇంచార్జి కొత్తపల్లి రఘు,జిల్లా మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ తాతపూడి వెంకటేష్ , ఎమ్మార్పీఎస్ నాయకులు గంపల సత్య ప్రసాద్,వల్లూరి సత్తిబాబు,జిల్లా మహిళ నాయకురాలు సావిత్రి ,మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు జొన్నాడ రాకేష్ , మంజేటి డేవిడ్, మిరియాల అశోక్,అనంత వరపు గాంధీ, బుద్దాల కుమార్ ,తోలేటి రాంప్రసాద్, యార్లగడ్డ నరేష్ , ఖండవల్లి లక్ష్మీ,డాన్ సూరి,జిల్లా మహిళలు ,యువత ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.