TV77తెలుగు రాజమహేంద్రవరం:
నగరంలో బ్లడ్ బ్యాచి లకు రౌడీ షీటర్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పనస చెట్టు ఏరియా వద్ద ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో
సి టి ఆర్ ఐ. పరిధిలో నివాసం ఉంటున్న దొంగ రెడ్డి( 28 ) అనే రౌడీ షీటర్ కు అతని ప్రత్యర్ధులు. బ్లేడ్ బ్యాచ్ షూటర్ సాయి, రౌడీషీటర్ లక్ష్మణ్ మరో ఇద్దరు తో పాత కక్షలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అదేవిధంగా శుక్రవారం రాత్రి కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగాయని తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. నట్లు స్థానికులు సమాచారం మద్యం మత్తులో ఉన్న షూటర్ సాయి అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత మేడ పై పడుకున్నా దొంగ రెడ్డి, ని నిద్రలేపి వెంట తెచ్చుకున్న మారణాయుదంతో విచక్షణా రహితంగా నరికి వేయడంతో అక్కడ అక్కడ రౌడీ షీటర్ దొంగ రెడ్డి, అక్కడికక్కడే కుప్పకూలాడు జరిగిన సంఘటన పై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. దీనిపై మూడో పట్టణ సీఐ మధు బాబు మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామని ఇరువర్గాల మధ్య పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ దారుణ హత్య జరిగిందన్నారు. నగరంలో గత కొంతకాలంగా రౌడీషీటర్లు. బ్లడ్ బ్యాడ్జీలు. దౌర్జన్యాలు దాడులు ఎక్కువయ్యాయని వీరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు హత్యలు ప్రతి హత్యలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.