శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్

TV77తెలుగు తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుంచి 15 వరకు ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. ఇవాళ సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేశారు.