ప్రగతి అసోసియేషన్ రూరల్ డెవలప్మెంట్ రాజమండ్రి లో నూతన శాఖ ప్రారంభం


 
TV77తెలుగు రాజమహేంద్రవరం: గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్య ఉపాధి అవకాశాల అభివృద్ధికి పర్డ్ సభ్యులు కృషి చేయాలని అని స్వచ్ఛంద సంస్థ ప్రగతి అసోసియేషన్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండర్ డైరెక్టర్ వి వి స్వామి పిలుపునిచ్చారు. స్థానిక జె ఎన్. రోడ్ లో ఆర్ కే ఫంక్షన్ హాల్ లో మంగళవారం సాయంత్రం పార్డ్ రాజమండ్రి నూతన శాఖను ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పార్డ్ సంస్థను పదేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఎర్నగూడెం కేంద్రంగా ప్రారంభించామని. అప్పటినుండి గ్రామీణ ప్రాంతాల్లో పేదలైన విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు విద్య ఆరోగ్య ప్రదమైన చేయూత అందిస్తామన్నారు. పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంస్థను విస్తరిస్తామని దానిలో భాగంగానే రాజమండ్రి లో నూతన శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో విద్య ఆరోగ్య ఉపాధికల్పన తో పాటు విస్తృతంగా మొక్కలు నాటడం వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం వంటి సమాజ పర్యావరణ హితమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంత కోఆర్డినేటర్ రమేష్, అనిల్ కుమార్, రాజమండ్రి శాఖ ప్రతినిధి కూడెల్లి రత్నకిషోర్ తదితరులు పాల్గొన్నారు.