దౌర్జన్యాలు
వార్డ్ సభ్యుడి పై సర్పంచ్ భర్త అనుచరులు దాడి...
అక్రమ పోలీస్ కేసు నమోదు
ప్రాణ రక్షణ కల్పించాలని బాధితుడు వినతి...
TV77తెలుగు కడియం:
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామ పంచాయతీలో సర్పంచి అయినవిల్లి రుక్మిణి భర్త వైసీపీ నాయకులు ,అయినవిల్లి వెంకటేశ్వర్లు . డి సి సి బి డైరెక్టర్ అయిన అయినవిల్లి వెంకటేశ్వర్లు అధికార మదం తో ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ మా వెనక ఉన్నారని, తమ మాటే వినాలని దౌర్జన్యం తో దాడులు చేస్తూ గ్రామ ప్రజలను, ప్రజాస్వామ్య వాదులను బెదిరిస్తూ, పోలీస్ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం పార్లమెంట్ నియోజకవర్గం లో కడియం మండలంలో సర్వత్ర అన్ని గ్రామాల్లో చోటు చేసుకోవడం ఎంపీ భరత్ కు సమస్యలు సృష్టిస్తుంది. తాజాగా కడియం మండలం మురమండ గ్రామం లో భరత్ అను చరులుగా చెప్పుకుంటూ బలహీన వర్గాల పై ,పంచాయతీ వర్గ సభ్యుల పై దౌర్జన్యాలు, తప్పుడు పోలీస్ కేసులు పెడుతూ కులపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్న వైసీపీ నేతల పగ ,ప్రతీకారాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి తెలుస్తోంది. గ్రామంలో అమాయకులపైన, బలహీన వర్గాల పైన దాడులు, దౌర్జన్యాలు చేస్తూ భయ త్వాన్ని కల్పించడాన్ని గ్రామంలో ఆందోళన నెలకొంది, కనీసం పంచాయతీ వార్డు సభ్యులు కాని వారు, వార్డు సభ్యులు కానివారు, సర్పంచ్ భర్త వెంకటేశ్వర్లు, అనుచరులు కలిసి మూడో వార్డు సభ్యుడిగా ఎన్నికైన ఏలూరి
దుర్గ ప్రసాద్ పై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ తమ పలుకుబడితో తప్పుడు పోలీస్ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తూరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ భార్య రుక్మిని అధికారాలను అడ్డంపెట్టుకుని గ్రామంలో అనధికారంగా వెంకటేశ్వర్లు ,అతని అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఈనెల 26,వ తేదీన గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యాన్ని కానీ, ప్రజాప్రతినిధులుగా సంబంధంలేని సర్పంచ్ భర్త అయినవిల్లి వెంకటేశ్వర్లు, అతని అనుచరులు బులు గురి గోవిందు, సర్పంచ్ మరిది అయినవిల్లి పాపయ్య య తదితరులు అనుచితంగా జోక్యం చేసుకుని తల్లి తల్లిదండ్రుల, ఎన్నికలను తప్పుదోవ పట్టించారని ,మూడో వార్డు సభ్యుడు ఏలూరి దుర్గాప్రసాద్ ఆరోపించారు. తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక ల్లో సంబంధం లేని అయినవిల్లి వెంకటేశ్వర్లు అతనీ అనుచరులకు సంబంధం లేదని , అయినప్పటికీ పాఠశాల లో తిష్ట వేసి తల్లిదండ్రులను ప్రలోభ పెట్టి , తమకు అనుకూలంగా దొంగ ఓట్లు వేయించుకోవడం, వెంకటేశ్వర్లు అనుచర వర్గం అక్రమాలకు తెర తీసిందని దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఏకపక్షంగా జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రశ్నించిన విధానంపై తనపై సర్పంచ్ భర్త ,అతని అనుచరులు కొట్టి సెల్ఫోన్ లాక్కుని, దుర్భాషలాడుతూ తనపై భౌతికంగా దాడి చేశారని దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, సర్పంచ్ భర్త అయినవిల్లి వెంకటేశ్వర్లు తనకున్న అధికార బలంతో కడియం పోలీస్ స్టేషన్లో తనపై అక్రమ పోలీసు కేసు నమోదు చేసి చిత్ర హింసలకు గురి చేయించారని దుర్గాప్రసాద్ ఆరోపించారు. గ్రామంలో వార్డు సభ్యుల గాని, సర్పంచ్ భర్త అనుచరులు సభ్యుడిగా ఎన్నికైన తనపై పంచాయితీలో రానివ్వకుండా అడ్డుపడడం, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక ల్లో తన జోక్యాన్ని అడ్డుకోవడం, భౌతికంగా బెదిరించడం, తనకు వ్యతిరేకంగా గ్రామంలో ఏమైనా చర్యలు చేపడితే ప్రాణాలు తీస్తామని ,వారు హెచ్చరించడం వల్ల అయినవిల్లి వెంకటేశ్వర్లు ,అతని అను చరుల నుండి ప్రాణహాని ఉందని పై ముగ్గురి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని ,దుర్గాప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.