ట్రాఫిక్ పోలీస్ వారి ఇ ఆఫర్ 50 శాతం డిస్కౌంట్ !
iraila 04, 2021
TV77తెలుగు తెలంగాణ:
ఎంతటి వారైనా సరే ట్రాఫిక్ పోలీసులు వదలి పెట్టడం లేదు. వీఐపీల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఫైన్లు విధిస్తున్నారు. రాంగ్ రూట్‌లో వచ్చినా, హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా కేసులు పెట్టడం, జరిమానా విధించడం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం రూపంలో జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఈ-చలానాలు పొందినవారు పోలీసుల కంటబడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.నగర వ్యాప్తంగా చాలా వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, రూ.వేలల్లో జరిమానాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ‘దసరా పండగ’ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఈ-చలానా అందుకుని చెల్లించనవారికి అవకాశం కల్పించింది. పెండింగ్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్‌తో చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అక్టోబరు 4 నుంచి 7 వరకు గోషామహల్ స్టేడియంలో నిర్వహించే‘ప్రత్యేక లోక్ అదాలత్’ద్వారా ఇలా చలాన్ల మొత్తాలను చెల్లించవచ్చని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో వివరించారు.మరి పోలీసులు ప్రకటన ఏ మేరకు విజయవంతమవుతుంది.ఎంత మంది దీనిని సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు.అయినప్పటికీ ఉల్లంఘనులు ఆగడం లేదు. కౌన్సెలింగ్ ఇచ్చి,భారీగా చలాన్లు విధిస్తున్నప్పటికీ ఇష్టారాజ్యంగా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది (జనవరి నుంచి జూన్ వరకు) ఆరు నెలల్లో భారీ స్థాయిలో ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది లాక్‌డౌన్ విధించారు.అదే మాదిరిగా ఈ ఏడాది కూడా కొన్ని రోజులు పరిమితులతో కూడిన లాక్‌డౌన్ కొనసాగింది. ఈ ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో చలాన్లు విధించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 27,45,574 మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించగా. అత్యధికంగా హెల్మెట్ లేనివారు 25,43,897 మంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు 35,201మంది ఉండగా.. మైనర్లు 1338 మంది ఉండటం గమనార్హం.