తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పింఛన్ లబ్ధి చేకూర్చాలని పంచాయతీ కమిషనర్ నాగేంద్ర కుమార్ కి వినతిపత్రం
iraila 03, 2021
TV77తెలుగు ముమ్మిడివరం:
తూర్పు గోదావరి జిల్లా మ్మియూడివరం మండల తెలుగుదేశం పార్టీ మరియు పట్టణతెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అర్హులైన పింఛన్ దారులు అందరికీ పాత ప్రభుత్వాలు పాటించిన విధానాలను ను పాటిస్తూ ప్రభుత్వ పింఛన్ ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పింఛన్ లబ్ధిదారులు పూర్తిగా నష్టపోయే ఈ పరిస్థితులలో ఉన్నారని ప్రభుత్వ నిబంధనలు మార్చుకుని పాత విధానాలు కొనసాగించాలని పింఛన్ 2250 నుండి 3000 మూడు వేలకు వెంటనే పెంచాలని మరియు కళాకారులకు గాని స్వతంత్ర సమరయోధులు గాను ప్రభుత్వం నుండి పింఛను పొందుతున్న కుటుంబాలలోని అర్హులైన పింఛన్ దారులకు కూడా పింఛన్ లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని కోరుతూ స్థానిక మండల పరిషత్ కార్యాలయ అధికారులకు మరియు ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ నాగేంద్ర కుమార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గొల్ల కోటి దొరబాబు, చెల్లి అశోక్, దొమ్మేటి రమణ కుమార్, పొద్దుకు నారాయణరావు, ములపర్థి బాలకృష్ణ,మిమ్మితీ చిరంజీవి, బొక్క రుక్మిణి, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, మెండి కమల, కుంచనపల్లి నారాయణ, కడలి నాగు, విళ్ల వీరస్వామి నాయుడు, దివి విజయకృష్ణ రాయల్, పిల్లి నాగరాజు, గోదా సి గణేష్, యాల్ల ఉదయ్, దంగేటి శ్రీనివాసరావు, నడిమింటి ప్రభాకర్ రావు, నడింపల్లి శ్రీనివాసరాజు, వాసంశెట్టి అమ్మాజీ, కొండేటి వెంకటలక్ష్మి, పెదపూడి రుక్మిని, పేరిచర్ల సురేష్ బాబు, గోని మడతల రాజా, బోంతూ శ్రీరాములు, కొప్పి శెట్టి శ్రీను, చింతపల్లి రాజు, అంబేద్కర్ మొదలగు వారు పాల్గొన్నారు.