పౌరుల నాణ్యమైన జీవితం కోసం
"ఆత్మ నిర్భర భారత్" ఆశయసాధనకై
"భారత్ సేవ" ప్రాజెక్ట్ ఆవిష్కరణ మహోత్సవం
TV77తెలుగు రాజమహేంద్రవరం:
తూర్పుగోదావరి జిల్లా భారత్ సేవ భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ప్రమాణాలతో సేవలను అందించడానికి, అలాగే దాదాపు పది లక్షలకు పైగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు ఐన కార్యక్రమం భారత్ సేవ దేశంలో అత్యుత్తమ సాంకేతికతో, 9 డైమెన్షన్స్ ప్యాట్రన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని పొందుపరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, వివిధ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా అవలంబించే విధంగా, G2C, G2B, B2B, B2C, C2C, C2B, N2C, I2C సేవలను ఒకే వేదిక మీదకి అనుసంధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా అవలంబించడానికి భారత్ సేవ మొదటి దశలో తాలూకా వారీగా పౌర సేవ సేవకులను "సిటిజెన్ సర్వీస్ ఎగ్జిగ్యూటివ్స్ నియమించడం జరిగింది.
ఇక గ్రామీణ ప్రాంత పౌరులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సేవలు అతి సులువుగా భారత్ సేవ CSE ద్వారా పొందడం జరుగుతుంది. డిజిటల్ ఇండియాని అవలంభించే ఒకే ఒక మార్గం ఈ భారత్ సేవ.ఈ కార్యక్రమ ఆవిష్కరణ రాజమండ్రి జిల్లాలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమమికి ముఖ్య అతిధిగా జక్కంపూడి రాజా (శాసనసభ్యులు, రాజానగరం) హాజరు అయి భారత్ సేవ CSE కి అపాయింట్మెంట్ లెటర్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ భారత్ సేవ రూపకర్త శ్రీ డా. అనిల్ కుమార్ అభినందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఈ భారత్ సేవ లాంటి వినూత్న కార్యక్రమం అవసరం అని దానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని, జిల్లాలో ఉన్న పౌరులందరు భారత్ సేవ సేవలను తమ మండల CSE ద్వారా పొందాలని రాజా చెప్పారు.ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఛానెల్ పార్ట్నర్ కౌటిల్య సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దివిలి సతీష్ , మరియు హిరణ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
యిమ్మంది బద్రి , హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా సెక్రటరీ వియ్యపు రామన్న రాజు యాదవ్ సార్వి మీడియా ప్రతినిధులు, తోట చక్రధర్, నాగరాజు, వెంకట రమణ, పి.ప్రసాద్, ప్రేమ్ అప్పరి సూర్య తేజ్ లు పాల్గొన్నారు.