వర్షాల తో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది

TV77తెలుగు హైదరాబాద్:
 వర్షాల తో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాసరావు జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓలు అన్ని స్థాయిల్లోని అధికారులు, వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులోనే ఉండాలని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దన్నారు. జిల్లాల్లో జ్వరాలు ఉన్న ప్రాంతాల్లో తరచుగా ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.