చీకట్లు పోయి వెలుగులు వచ్చాయి


దీర్ఘకాల సమస్యకు చెక్ పెట్టిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్....!!

 వీటిపీస్ సర్వీస్ రోడ్డు లో 30 లక్షల నిధులతో విద్యుత్ దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే వసంత....!!! 

 విద్యుత్ దీపాల పనులను త్వరగతిన పూర్తి చేసిన మున్సిపల్ ఏ.ఈ సాయి గణేష్...!!! 

TV77తెలుగు మైలవరం: రిపోర్టర్ సత్య.
 మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరో దీర్ఘ కాల ప్రజా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.కటిక చీకటి లో మగ్గుతున్న వీటిపీస్ పాతగేటు సర్వీస్ రోడ్డు కు విద్యుత్ కాంతులు ప్రసాదించి మరో కీలక ఘట్టానికి అంకురార్పణ చేశారు.ఇబ్రహీంపట్నం వైసీపీ నాయకుల వినతులు, స్థానిక ప్రజల విజ్ఞప్తులను పరిగణo లోకి తీసుకున్న ఎమ్మెల్యే వసంత 30 లక్షల మేర ప్రత్యేక నిధులతో పనులు పూర్తి చేశారు.పనుల ప్రారంభం నాటి నుండి నిధుల మంజూరు, సకాలంలో కాంట్రాక్ట్ టెండర్ లు ప్రక్రియ ప్రారంభించి పనులను నెల రోజుల వ్యవధిలో పూర్తి చేశారు.విద్యుత్ దీపాల ప్రారంభోత్సవం లో బాగంగా ఈరోజు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ లైట్స్ ఆన్ చేసి వెలుగులకు స్వాగతం పలికారు.