రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి

TV77తెలుగు రాజస్థాన్: బస్సును ఢీకొన్న ప్రమాద ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.18 మంది ప్రయాణికులు వెళుతున్న కారు బార్మేర్ గ్రామం వద్ద జాతీయరహదారిపై బస్సును ఢీకొట్టింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గాయపడిన వారిని జోధ్ పూర్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలంలోని రోడ్డును పరిశీలించి, ఇంజినీరింగ్ ఢిపెక్టు ఉంటే త్వరలో రోడ్డును మరమ్మతు చేపిస్తామని ఎస్పీ ఆనందశర్మ చెప్పారు. నలుగురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.