ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు

TV77తెలుగు అమరావతి: రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని సమూలంగా మార్చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు.ఇందులో భాగంగానే సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు జరుగుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వెల్లడించారు. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్త వారిని తీసుకుంటారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే సీఎం జగన్‌తో చెప్పానని మంత్రి బాలినేని వెల్లడించారు.తన మంత్రి పదవి పోయినా భయపడబోనని మంత్రి బాలినేని అన్నారు.ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినపుడు తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇపుడు ఆ సమయం దగ్గర పడుతుండడంతో మంత్రుల్లో ఎవరు ఉంటారో,ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది.తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు.వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు.