సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గిరిజనులను సూచించిన ఎస్సై లోకేష్

TV77తెలుగు నర్సీపట్నం: కొయ్యూరు మండలంలో పలు ప్రాంతాలు సందర్శించిన ఎస్ ఐ సీజనల్ వ్యాధులతో మనిషి ఆరోగ్యానికి మరింత ప్రమాదమని దీనిని గుర్తించుకొని మారుమూల గిరిజనులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంప ఎస్ఐ లోకేష్ కోరారు.తన సిబ్బందితో కలిసి మండలంలోని మంప పోలీస్టేషన్ పరిధిలోని యూ చిడి పాలెం పంచాయితీ తీగల మెట్ట. పాలసముద్రం, మర్రి పాకలు. రేవులకోట, తోట చిలుకు బిల్లపాలెంమొదలగు మారుమూల గ్రామాలకు టాస్క్ కు వెళ్లిన ఎస్సై లోకేష్ గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు అలాగే ప్రస్తుతం కొవిడ్-19 పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను గూర్చి గిరిజనులకు అవగాహన కల్పించారు అటుపై చిన్నచిన్న వ్యాధులకు సంబంధించి మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు. సిబ్బంది పాల్గొన్నారు.