నాటుసారా స్థావరాలపై స్పెషల్ డ్రైవ్
iraila 15, 2021
TV77తెలుగు కొత్తపేట:
తూర్పు గోదావరి జిల్లా, ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు రావులపాలెం సి ఐ వి .కృష్ణ కొత్తపేట ఎస్ ఐ శ్రీనివాస్ నాయక్ సిబ్బంది కలిపి అక్రమ మద్యం నాటుసారా స్థావరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.డ్రైవ్ లో భాగంగా కొత్తపేట మండల పరిధిలో యేలిశెట్టి వారి పాలెం, మరియు గోగి వారి పేట లో 1700 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది.అలాగే వాడపాలెం, పెదపేట లో 3 లీటర్ల నాటుసారా మరియు గంటి గ్రామంలో బెల్ట్ షాపు మద్యం అమ్మే వ్యక్తిని గుర్తించి 22 బాటిల్ లు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది.బుధవారం ఈ స్పెషల్ డ్రైవ్ లో బెల్లపు ఊట 1700 లీటర్లు నాటు సారా మూడు లీటర్లు
మద్యం బాటిల్ 22 స్వాధీనం చేసుకున్నారు .