రావులపాలెం లో224కేజీల గంజాయి స్వాధీనం

TV77తెలుగు రావులపాలెం: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు,అమలాపురం డిఎస్పి వై మాధవరెడ్డి ,మరియు రావులపాలెం సిఐ వి కృష్ణ ఆధ్వర్యం లో రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు ,సిబ్బంది ,మధ్యవర్తులు మరియు డిప్యూటీ తహశీల్దార్ కలసి ఈతకోట టోల్ ప్లాజాకు ముందు రాజమండ్రి నుండి వచ్చు వాహనాలను తనిఖీ చేయుచుండగా శుక్రవారం ఉదయం 11:30 ని"కు రాజమండ్రి వైపు వచ్చు AP20AW1127 నెంబర్ గల స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో 105 గంజాయి ప్యాకెట్లు,7 సంచుల్లో మూటలు కట్టి ఉండగా పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని తుకం వేయగా సుమారు 224 కేజీలు ఉన్నదని డిఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.దిని మార్కెట్ విలువ రూ 4,48,000/- అని అన్నారు. గంజాయి తరలించుచున్న హైదరాబాద్ కు చెందిన ఇద్దర్నీ (షేక్ ఖాజా,తండ్రి పిరావల్లి వయస్సు 26,మరియొకరు సయ్యద్ కథీర్,తండ్రి మస్తాన్ అను వారిని అరెస్ట్ చేసి గంజాయిని,కారును,వారి యొక్క సెల్ ఫోన్లును,రూ 32000/- నగదు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నాం అని డిఎస్పీ తెలిపారు వీరికి సహకరించిన మిగిలిన ముద్దాయిల కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారి గురించి గాలింపు చర్యలు చేపట్టాం అని డిఎస్పీ వై మాధవ రెడ్డి తెలిపారు.