పట్టుబడిన బైక్‌లకు ఈనెల 21న వేలం
iraila 14, 2021
TV77తెలుగు కర్నూలు:
కర్నూలు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన బైక్‌లకు బహిరంగ వేలంను నిర్వహించనున్నామని స్టేషన్ సిఐ ఎం.సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెబ్ అసిస్టెంట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన 12 వాహనాలకు ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక కర్నూలు సెబ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బహిరంగ వేలాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచినవారు తప్పనిసరిగా రూ.1000 కాషన్ డిపాజిట్ చెల్లించాలని, ఈ సొమ్మును తిరిగి చెల్లిస్తారని చెప్పారు.