రూ.20 వేలు తీసుకుని నిందితులను వదిలి వేశారనే అభియోగం పై ఎస్.ఐ,హెడ్ కానిస్టేబుల్ లపై విచారణ
iraila 07, 2021
TV77తెలుగు కాజులూరు:
అక్రమ మద్యం పట్టివేత కేసులో రూ.20 వేలు తీసుకుని నిందితులను వదిలి వేశారనే అభియోగం పై కాజులూరు మండలం గొల్లపాలెం ఎస్.ఐ. ఎం.పవన్ కుమార్,హెడ్ కానిస్టేబుల్ భీమ శంకర్ లపై విచారణ చేపట్టిన స్పెషల్ బ్రాంచి పోలీసు అధికారులు.ఈ నెల 3న కాజులూరు కు చెందిన కమిడి వీరేంద్ర, భాను ప్రకాష్ లను అక్రమ మద్యం (యానాం మద్యం) విక్రయిస్తున్నారనే నెపంతో అదుపులోకి తీసుకున్న గొల్లపాలెం పోలీసులు స్టేషన్ లో విచారణ అనంతరం ఎస్.ఐ.పవన్ కుమార్ నిందితుల నుంచి రూ.20వేలు తీసుకుని వదిలేశారు.దీంతో కాజులూరు కు చెందిన వంగా శ్రీనివాస్, పెంకే రవితేజ,కనుమూరి సతీష్ లు ఈ నెల 6న జిల్లా ఎస్.పి.రవీంద్ర బాబుకు గొల్లపాలెం పోలీసు స్టేషన్ సెటిల్మెంట్ లకు అడ్డాగా మారిందని,ఎస్.ఐ. పవన్ కుమార్,హెడ్ కానిస్టేబుల్ భీమ శంకరం లపై లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు.దీనిపై తీవ్రంగా స్పందించిన ఎస్.పి రవీంద్ర బాబు గొల్లపాలెం ఎస్.ఐ పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమ శంకర లపై విచారణ చేపట్టాలని ఎస్.బి సి.ఐ కె.వి.వి.సత్యనారాయణ కు ఆదేశాలు జారీ చేసారు.గొల్లపాలెం పోలీసు స్టేషన్ లో విచారణ చేపట్టిన ఎస్.బి సిఐ సత్యనారాయణ జిల్లా ఎస్.పి.రవీంద్ర బాబు ఆదేశాల మేరకు గొల్లపాలెం ఎస్.ఐ. పోలీసు సిబ్బంది పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రహస్య విచారణ చేస్తున్నామని ఎస్.బి.సిఐ వెల్లడి.విచారణ నివేదికను జిల్లా ఎస్.పి.కి అందజేసిన ఎస్.బి. సిఐ సత్యనారాయణ.