ఆస్టేషన్‌లో రూ.16 లక్షలు మాయం.అతడు కూడా మిస్సింగ్
iraila 03, 2021
TV77తెలుగు నూజివీడు: టౌన్ పోలీస్ స్టేషన్‌లో డబ్బు మాయం కావడం కలకలంరేపింది. పోలీస్‌స్టేషన్‌లో దాచిన మద్యం సొమ్ములో ఏకంగా రూ.16 లక్షలు మాయమైంది. ప్రభుత్వ మద్యం షాపుల్లో లిక్కర్ అమ్మగా వచ్చిన సొమ్మును. సెలవు రోజుల్లో పోలీస్ స్టేషన్‌లో రాత్రి భద్రపరుస్తారు. ఆ మరుసటి రోజు బ్యాంకుల్లో జమ చేస్తారు. వరుస సెలవులతో మద్యం అమ్మకాల సొమ్మును కృష్ణా జిల్లా నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్‌లో భద్రపర్చారు. గురువారం బ్యాంకులో జమ చేయడానికి సిద్ధం కాగా.. అందులో రూ.16 లక్షల వరకు నగదు లెక్క తేలలేదు. దీంతో పోలీసు అధికారులు ఆరా తీశారు. డబ్బు మాయం అయ్యాక ఓ కానిస్టేబుల్ విధులకు గైర్హాజరు కావడంతో అతడే నిందితుడిగా అనుమానిస్తున్నారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుల్ తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయన సొత్తు తీసుకుని వెళ్లాడా, లేక ఇంకెక్కడైనా దాచాడా.. అనే విషయం అతను దొరికితేగానీ తెలియదన్నారు.